ఎమ్మిగనూరు పట్టణంలోని అయ్యప్పస్వామి గుడి వంక దగ్గర కోటి రుపాయల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు శాసన సభ్యులు ఎర్రకోట చెన్నకేశవరెడ్డి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణ, గ్రామంలో అభివృద్ధి పనులు చేస్తున్నట్లు తెలిపారు. అన్ని వార్డులో పనులు జరుగుతున్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో సుధాకర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ డాక్టర్ కెయస్. రఘు, వైస్ చైర్మన్ డి. నజీర్ ఆహ్మద్, డిఈఈ మనోహర్ రెడ్డి, జిల్లా వక్ఫ్ బోర్డు ఉపాద్యక్షులు రియాజ్ ఆహ్మద్, పట్టణ అధ్యక్షుడు బుట్టా రంగయ్య, అధికార ప్రతినిధి కె. సునీల్ కుమార్, కౌన్సిలర్లు, ఇన్ చార్జ్ లు, నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.