రానున్న ఎన్నికల్లో వైసీపీ సచివాలయ కన్వీనర్లు రథసారధులే కీలకమని రాష్ట్ర వైఎస్సార్సీపీ కమిటీ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవి వెంకట్ నాగ్ అన్నారు. శనివారం ఆమదాలవలస పట్టణంలో వ్యవసాయ మార్కెట్ కమిటీ యార్డులో సచివాలయ కన్వీనర్లు, గృహసారధులు, గ్రామ వాలంటీర్లకు శనివారం అవగాహన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి, ప్రజలకు మధ్య వారధిగా మీ బాధ్యత చాలా కీలకమని నాయకులు సూచించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి సభ్యులు బెండి గోవిందరావు, ఎంపీపీ ప్రతినిధి, మండల వైసీపీ పార్టీ అధ్యక్షులు తమ్మినేని శ్రీరామ్ మూర్తి, పిఎసిఎస్ అధ్యక్షులు గురుగుబెల్లి శ్రీనివాసరావు, సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ నాయకులు, కన్వీనర్లు, గృహ సారథులు, వాలంటీర్లు, తదితరులు పాల్గొన్నారు.