పార్వతీపురం మన్యం జిల్లా, గుమ్మలక్ష్మీపురం మండలంలో పెను ప్రమాదం తప్పింది. మండ గ్రామ సమీపంలో గల వంతెన వద్ద ఆర్టీసీ బస్ బోల్తా పడింది. గుమ్మలక్ష్మీపురం నుండి పార్వతీపురం వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎదురుగా వస్తున్న ఎక్స్ ప్రెస్ బస్ను తప్పించబోయి వంతెనను ఢీ కొన్నట్టు డ్రైవర్ తెలిపారు. బస్లో మొత్తం 23 మంది ప్రయాణికులు ఉండగా.. ముగ్గురు ప్రయణికులకు తలకు, కంటికి గాయాలయ్యాయి. హుటాహుటిన క్షతగాత్రులను భద్రగిరి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ప్రయాణికులు క్షేమంగా ఉండటంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు.