వైసీపీ ప్రభుత్వానికి గద్దె దింపుదామని టీడీపీ నాయకులు పిలుపు నిచ్చారు. శనివారం చిలమత్తూరు మండలంలోని కోడూరు పంచాయతీ వడ్డిపల్లి గ్రామంలో ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి అనే కార్యక్రమం నిర్వహించారు. నాయకులు, కార్యకర్తలు ఇంటింటికి తిరిగి వైసీపీ ప్రభుత్వం అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టారు. ఈ ప్రభుత్వ పాలనలో ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదని విమర్శించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్సీ సెల్ అధికార ప్రతినిధి బేకరీ గంగాధర్, మాజీ ఎంపీటీసీ సూర్యనారాయణ, శ్రీదేవి, నాగార్జున, గాజుల కిష్టప్ప, గంగాధర్, నారాయణప్ప, వెంకటేశులు తదితరలు పాల్గొన్నారు.