ప్రధాని మోడీ సారథ్యంలో బీజేపీ ప్రభుత్వం దేశంలో దోపిడీ, దుర్మార్గ పాలన సాగిస్తోందని ఐఎఫ్టియు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెవి. వెంకటేశ్వర్లు, ఓపిడిఆర్ రాష్ట్ర కార్యదర్శి ఆర్. రామ్ కుమార్ విమర్శించారు. శనివారం గుంతకల్లు పట్టణంలోని శ్రీ గుంత కల్లప్ప స్వామి కళ్యాణ మండపంలో భారత కార్మిక సంఘాల సమాఖ్య (ఐఎఫ్టియు ) ప్రథమ జిల్లా మహాసభ ఆ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బి. సురేష్ అధ్యక్షతన జరిగింది. ఈ సభకు ముఖ్య వక్తలుగా ఓపిడిఆర్ రాష్ట్ర కార్యదర్శి ఆర్. రామ్ కుమార్, ఐఎఫ్ టియూ రాష్ట్ర ప్రధాన కార్య దర్శి జెవి. వెంకటేశ్వర్లు, సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి ఇండ్ల ప్రభాకర్, సిటిజన్ ప్రోగ్రెసివ్ ఫోరం కార్యదర్శి తారకేష్, మానవ హక్కుల వేదిక తెలుగు రాష్ట్రాల సమన్వయ కమిటీ కన్వీనర్ చంద్ర శేఖర్ హాజరయ్యారు. ఈ సందర్భం గా వారు మాట్లాడుతూ కేంద్రంలోని నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్మిక హక్కులు, చట్టాల మీద ఉక్కు పాదాన్ని మోపుతూ అణిచివేయడా నికి కుట్రలు చేస్తోందన్నారు. మోడీ ప్రభుత్వ విధానాలు కార్పొరేట్, బహుళ జాతి కంపెనీలకు, బడా పారిశ్రామికవేత్తలకు అనుకూలంగా ఉన్నాయన్నారు. కాంగ్రెస్ పరిపాలన లో అనేక కేంద్ర పరిశ్రమలు ఏర్పాటు చేస్తే మోడీ ప్రభుత్వం వచ్చాక గడి చిన 8 ఏళ్లలోనే ఉన్న ప్రభుత్వ రంగ సంస్థలను అంబానీ, ఆదాని వంటి కార్పొరేట్ దిగ్గజాలకు అతి తక్కువ ధరలకు కట్టబెడుతోందన్నారు. బ్యాంకులకు కన్నాలు వేసి ప్రజా ధనాన్ని దోచుకెళ్తున్న దొంగలకే మోడీ ప్రభుత్వం రక్షణ కల్పిస్తోంద న్నారు.
బిజెపి అధికారంలోకి వస్తే నల్లధనాన్ని వంద రోజుల్లో బయటికి తెచ్చి ప్రజల ఖాతాలో జమ చేస్తారని మోడీ గొప్పలు చెప్పి ఒక్క పైసా కూడా ప్రజలకు ఇవ్వలేదన్నారు. నాడు రక్తం చిందించి కార్మికుల సాధించు కున్న చట్టాలను మోడీ సర్కారు బడా పారిశ్రామికవేత్తలకు అనుకూ లంగా నాలుగు లేబర్ కోట్లుగా మార్చి కనీసం కార్మికులు సంఘాన్ని కూడా ఏర్పాటు చేసుకొని దుస్థితి కల్పించిందన్నారు. కేంద్రంలోని మోడీ కుట్రలను కార్మికులు ప్రజలు నిలదీయాల్సిన సమయం ఆసన్న మైందన్నారు. ఈ మహాసభలో నాయకులు శ్రీరాములు, చిన్నా తదితరులు పాల్గొన్నారు.