శ్రీ సత్య సాయి జిల్లా లేపాక్షి మండలం కొండూరు, కొర్లకుంట గ్రామాల దళిత రైతులు మా భూమి మాకిప్పించాలని శనివారం తహసీల్దార్ కార్యాలయం ముందు మహాధర్నా నిర్వహించారు. కొండూరు వద్ద ప్రభుత్వ భూమిని తమకు ప్రభుత్వం మంజూరు చేసిం దని అయితే ఈ భూమిని కొంతమంది ఆక్రమించుకుని కుశలవ పేరుతో పాసుపుస్తకాలు చేసుకున్నారన్నారు. తమకు తక్కువ ధర చెల్లించి తమ భూములను స్వాధీనం చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక అధికారులు, ఉన్నతాధికార లు స్పందించి తమకు తమ భూమిని ఇప్పించాలని తహసీల్దార్ కార్యాలయంలో వినతిపత్రం అందించారు.