లేపాక్షి మండలంలోని వివేకానంద జిల్లాపరిషత్ ప్రభుత్వ పాఠశాల ఆవరణంలో ఉన్న బీసీ హాస్టల్‌ను విద్యాశాఖ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ ప్రకాష్ శనివారం సమయంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్ విద్యార్థులతో ముఖాముఖి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారి నోటుపుస్తకాలను పరిశీలించారు. సిలబస్ సకాలంలో బోధించలేదని తెలుసుకుని దానికి సంబంధించిన కారణాలను వెంటనే తనకు నివేదిక పంపాలని ఎంఈఓ నాగరాజునాయక్ కు ఆదేశించారు. ఈ యన వెంట జిల్లాస్థాయి అధికారులు ఉన్నారు.