అసోంలో బాల్య వివాహాలపై ప్రభుత్వం ఉక్కుపాదం మోపుతుంది. మైనర్లను వివాహం చేసుకున్న వేలాది మందిని పోలీసులు అరెస్టు చేస్తున్నారు. 24 గంటల పాటూ ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తూ, ఇప్పటివరకు 2,258 మందిని అరెస్టు చేశారు. అయితే, తమ భర్తల అరెస్టుపై భార్యలు రహదారిపై ఆందోళన చేపట్టారు. ధుబ్రీ జిల్లాలో నిన్న ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మహిళలను వెళ్లగొట్టడానికి పోలీసులు లాఠీచార్జి చేశారు.