ఆంధ్రప్రదేశ్లో రోడ్లు రక్తసిక్తమయ్యాయి. వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు మహిళలు మృతి చెందారు. శ్రీకాకుళం జిల్లా మందడిలో వేగంగా వచ్చిన లారీ ఉపాధి హామీ కూలీలపైకి దూసుకెళ్లిన ఘటనలో ఐదుగురు ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు నంద్యాల జిల్లాలో ఆటో బోల్తా పడి ఇద్దరు విద్యార్థినులు మృతి చెందారు. వీరి మృతితో ఆయా కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది.