ప్రకాశం జిల్లా మార్కాపురం డివిజన్ లో పర్యటనలో భాగంగా పెద్దారవీడు మండలం రాజం పల్లె గ్రామం సమీపంలో ఉన్న రూ.90 లక్షల గొడ్రాలి కొండ తిరుమల స్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనులకు ఆదివారం టీటీడీ డి ఛైర్మన్. వైసి. సుబ్బారెడ్డి, మంత్రి సురేష్ శంకుస్థాపన చేశారు. ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో మార్కాపురం ఎమ్మెల్యే కె. పి నాగార్జున రెడ్డి, గిద్దలూరు ఎమ్మెల్యే అన్న రాంబాబు, పెద్దిరెడ్డి సూర్య ప్రకాష్ రెడ్డి, మండల జడ్పీటీసీ, ఎంపీటీసీ, మండల కన్వీనర్, హిందూ పరిరక్షణ సమితి సభ్యులు పాల్గొన్నారు.