ఇరాక్ మాజీ అధినేత సద్దాం హుస్సేన్ ఇష్టపడి తయారు చేయించుకున్న ఓడను ఇరాక్ ప్రభుత్వం శాస్త్ర పరిశోధన కేంద్రంగా మార్చింది. ఈ ఓడను సద్దాం ఓ డెన్మార్క్ కంపెనీ ద్వారా తయారు చేయించుకున్నాడు. దీని తయారీ 1980లో ప్రారంభమవ్వగా మరుసటి ఏడాది ఇరాక్ తీరానికి చేరుకుంది. నాలుగు అంతస్థులు, పద్దెనిమిది గదులతో రూపొందించిన ఈ ఓడ పేరు 'బస్రా బ్రీజ్'. ఇరాక్ 2018లో దీన్ని అమ్మకానికి పెట్టగా ఎవరూ కొనుగోలు చేయలేదు.