విశాఖలో ఆర్బీఐ రీజనల్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాలని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అధికారులు నిర్ణయించారు. రాష్ట్ర ప్రభుత్వం విశాఖలో రాజధానిగా ప్రకటించడంతో ఆర్బిఐ కూడా తమ సేవలను విస్తృతపరచాలని నిర్ణయించింది. ఈ మేరకు విశాఖ నగర పరిధిలో కార్యాలయం ఏర్పాటు చేసేందుకు స్థల పరిశీలన చేస్తున్నారు. తాత్కాలికంగా కార్యాలయాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన భవంతులను కూడా అధికారులు పరిశీలిస్తున్నారు. ఉగాది నాటికి ఈ సేవలను అందుబాటులోకి తేవాలని భావిస్తున్నారు.