పర్చూరు మండలం నూతలపాడు గ్రామంలో గుట్టు తప్పుడు కాకుండా నడుస్తున్న పేకాట స్థావరంపై ఎస్సై చెంచు ప్రసాద్ శనివారం సాయంత్రం మెరుపు దాడి చేశారు. ఈ సందర్భంగా నలుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుండి 4540 రూపాయల నగదును స్వాధీనపరుచుకున్నారు. ఎస్పీ జిందాల్ ఆదేశాల మేరకు నిరంతరం ఈ తరహా దాడులు జరుగుతాయని మండలంలో ఎవరూ జూద కార్యకలాపాలు నిర్వహించరాదని ఎస్సై చెంచు ప్రసాద్ స్పష్టం చేశారు. ఇందుకు భిన్నంగా జరిగితే కఠిన శిక్షలు తప్పవని ఆయన హెచ్చరించారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa