తరచు ఆన్‌లైన్‌లో ప్రకటనలు ఇస్తూ మభ్యపెట్టి మోసాలకు పాల్పడే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కడప పోలీసు కళాజాత బృందం ప్రజలకు సూచనలిచ్చింది. ఎర్రగుంట్ల మండల పరిధిలోని పెద్దనపాడులో శనివారం రాత్రి కడప కళాజాత బృందం ప్రత్యేక నాటక కార్యక్రమాన్ని నిర్వహించి ప్రజలకు అవగాహన కల్పించింది. అసాంఘిక కార్యక్రమాలపై అప్రమత్తం గా ఉండాలని, ఆన్‌లైన్ మోసాలపై, సోషల్ మీడియాలో వచ్చే ప్రకటనలపై కూడా జాగ్రత్తగా ఉండాలన్నారు. మట్కా, క్రికెట్‌బెట్టింగ్, ఆన్‌లైన్ జూదం, ఫ్యాక్షన్ వంటి వాటికి యువత దూరంగా ఉండాలన్నారు. ఈకార్యక్రమంలో సీఐ మంజునాథరెడ్డి, ఎస్‌ఐ ప్రవీణ్ కుమార్‌రెడ్డి, ఏఎస్‌ఐ రాజారెడ్డి, ఎస్‌బీ హెడ్‌కానిస్టేబుల్ హిమాం, పోలీసు సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa