రాష్ట్రంలో ఎక్కడైనా బాల్య వివాహాలు జరిపితే అలాంటివారిపై పోలీసు కేసులు నమోదు చేసి, చట్టపరంగా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ చైర్‌పర్సన్ కేసలి అప్పారావు జిల్లాల ఎస్పీలను ఆదేశించారు. శనివారం ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. రాష్ట్రంలో మాతాశిశు మరణాల రేటు ఎక్కువగా ఉందని, అందుకు బాల్య వివాహాలు ప్రధాన కారణమని చెప్పారు. గ్రామ, మండల, జిల్లా స్థాయి బాల్య వివాహాల నిరోధక అధికారులందరూ ఈ చట్టాన్ని కఠినతరంగా అమలు చేయడం కోసం అన్ని శాఖల సమన్వయంతో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది సహకారంతో చర్యలు తీసుకోవాలన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa