తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్ర ఆదివారం నాటికి పదో రోజుకు చేరింది. ఇవాళ పూతలపట్టు నియోజకవర్గంలో పాదయాత్ర జరగనుంది. తవణంపల్లిలో గాండ్ల సామాజిక వర్గీయులతో లోకేష్ భేటీ కానున్నారు. 10:30 గంటలకు కురపల్లెలో బీసీలతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహిస్తారు. 11:30కు కాణిపాకం వినాయకస్వామి ఆలయంలో లోకేష్ ప్రత్యేక పూజలు చేస్తారు. ఈ సాయంత్రం 4:20 గంటలకు కాణిపాకంలో యువతతో ముఖాముఖి మాట్లాడతారు. రాత్రి 7:40 గంటలకు తెల్లగుండ్ల గ్రామస్తులతో సమావేశం నిర్వహిస్తారు. రాత్రి మంగసముద్రంలో లోకేష్ బస చేస్తారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa