నారా లోకేష్ చేపట్టిన యాత్ర పాదయాత్ర కాదని బాధ యాత్ర అని వైసిపి అనకాపల్లి జిల్లా అధ్యక్షుడు చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ ఎద్దేవా చేసారు. నర్సీపట్నం ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం సచివాలయ కన్వీనర్లు గృహసారధుల శిక్షణ తరగతుల్లో ఆయన ప్రసంగించారు. స్థానిక ఎమ్మెల్యే పెట్ల ఉమా శంకర్ గణేష్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఆయన మాట్లాడుతూ లోకేష్ పాదయాత్రకు జనాలు ఎవరు రావడం లేదన్నారు. ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి చేసిన పాదయాత్రకు దీనికి ఎక్కడా పోలిక లేదన్నారు. ఎమ్మెల్యే ఉమా శంకర్ గణేష్ మాట్లాడుతూ గృహ సారథులు సచివాలయం కన్వీనర్లు పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో వైసీపీకి చెందిన ప్రజా ప్రతినిధులు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.