పెడన నియోజకవర్గం పెడన మండలం పెనుమల్లి గ్రామంలో సోమవారం దేవరపల్లి రాంబాబుకు చెందిన గృహం విద్యుత్తు షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం జరిగింది. ఈ షార్ట్ సర్క్యూట్ వల్ల దేవరపల్లి రాంబాబు ఇంట్లో వున్న గృహోపకరణాలన్నీ కాలి బూడిద అయ్యాయి. అలాగే 50 వేల రూపాయలు నగదు 10 నవర్స్ ల బంగారం కూడా ఈ ప్రమాదంలో కాలిపోయినట్టు కుటుంబీకులు తెలిపారు. విషయం తెలుసుకున్న పెడన మండలం మార్కెట్ యార్డ్ చైర్మన్ గరికపాటి చారుమతి మండల పరిషత్ రాజుల పాటి అచ్యుత్ రావు గ్రామపంచాయతీ సర్పంచ్ గరికపాటి రామానాయుడు బాధితులను పరామర్శించారు. పెడన నియోజకవర్గం పెడన మండలం పెనుమల్లి గ్రామంలో రాష్ట్ర గృహ నిర్మాణ శాఖా మంత్రి, పెడన శాసనసభ్యులు జోగి రమేష్ సహకారంతో పది వేల రూపాయల ఆర్థిక సహాయాన్ని బాధితులకు అందించారు. ఇంటి నిర్మాణానికి ప్రభుత్వ పరంగా సహకరిస్తామని ప్రజా ప్రతినిధులు దేవరపల్లి రాంబాబుకు హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పెడన మండలం మార్కెట్ యార్డ్ చైర్మన్ గరికపాటి చారుమతి, మండల పరిషత్ రాజుల పాటి అచ్యుత్ రావు, గ్రామపంచాయతీ సర్పంచ్ గరికపాటి రామానాయుడు, నడుతూరు మాజీ సర్పంచ్ సింగంశెట్టి రాంబాబు, పెనుమల్లి మాజీ ఎంపీటీసీ పడమట వెంకటరావు, తదితరులు పాల్గొన్నారు.