భవన నిర్మాణ కార్మికుల సంఘ సంక్షేమానికి కృషి చేస్తానని డాక్టర్ ఏపీజె అబ్దుల్ కలాం భవన నిర్మాణ, ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ సంఘం నూతన అధ్యక్షుడు గుండ్లదుర్తి రామాంజులరెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ప్రొద్దుటూరు స్థానిక ఆర్ట్స్ కళాశాల రోడ్డులోని ఆ సంఘ కార్యాలయంలో నూతన అధ్యక్షుడిగా ఎన్నుకొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంఘ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానన్నారు. కార్యక్రమంలో సంఘ వ్యవస్థాపకుడు, కన్వీనర్ పద్మవీరన్న, గౌరవాధ్యక్షుడు సంజీవరాయుడు, చెన్నారెడ్డి, ప్రధాన కార్యదర్శులు పద్మవినోద్, ఓబులేసు, కో కన్వీనర్ శ్రీనివాసయాదవ్, సలహాదారులు శ్రీనివాసాచారి, కార్యదర్శులు బాలయ్య, రెడ్డి వెంకటేష్, నరసింహులు, ఆంజనేయులు, గైబు బాష, తదితరులు పాల్గొన్నారు.