మానసిక ఒత్తిడి జయిస్తే విజయం తద్యమని ప్రముఖ వ్యాఖ్యాత శివప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. పులివెందుల నియోజకవర్గం తొండూరు పట్టణంలోని స్థానిక వెలుగు గురుకుల పాఠశాలలో ఆదివారం స్నేహిత అమృత హస్తం ఆధ్వర్యంలో 10వ తరగతి ఇంటర్ పరీక్షలకు సంబంధించిన అంశాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ. ఒక్కరు ఎదగాలి అనుకున్నప్పుడు ఒక నిర్దేశిత లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలన్నారు. అటువంటప్పుడే ప్రతి విద్యార్థి అనుకున్నది సాధించే అవకాశం మెండుగా ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ తులసమ్మ రాజు సభ్యులు పాల్గొన్నారు.