దువ్వూరులో పట్టణం లో మరుగుదొడ్లు లేక ప్రజలు చాలా అవస్థలు పడుతున్నారు. నిత్యం మండలంలోని గ్రామాల ప్రజలు ఆఫీసులకు, ప్రయాణ నిమిత్తం పనులపై వస్తుంటారు. మరుగుదొడ్డి లేక చాలా ఇబ్బందులు పడుతున్నారు. పురుషులైతే మూత్రంకు వెళ్లాలంటే ఏదో ఒక చోట శాటుచేసుకుని మూత్రం వదులుతున్నారని ప్రజలు వాపోతున్నారు. మరి స్రీల పరిస్థితి వర్ణనాతీతం. ఇప్పటికైనా మండల అధికారులు, గ్రామ పంచాయతీ అధికారులు ప్రజాప్రతినిధులు స్పందించి దువ్వూరు లో సులబ్ కాంప్లెక్స్ నిర్మించాలని మండల ప్రజలు కోరుకుంటున్నారు.