ప్రస్తుత కాలంలో చాలా మంది గుండెపోటుకు గురవుతున్నారు. ఈ నేపథ్యంలో గుండెను ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే పలు జాగ్రత్తలు తీసుకోవాలి. అవేంటో ఇప్పుడు తెలుసుకుందాం.
* రోజూ నడవటం, మెట్లు ఎక్కటం వంటివి చేయాలి.
* రోజూ కనీసం 20 నిమిషాల పాటు ధ్యానం చేయాలి. ధ్యానం చేస్తే ఒత్తిడి తగ్గుతుంది.
* రోజూ వ్యాయామం చేయాలి. వ్యాయామం చేస్తే గుండె ఆరోగ్యాన్ని దెబ్బతీసే కార్టిజోల్ వంటి హార్మోన్లు స్థాయులు ఉద్ధృతం కాకుండా ఉంటాయి.
* నిద్రలేమితో రక్తపోటు పెరిగి, గుండెజబ్బుకు దారితీస్తుంది. అందుకే ప్రతి రోజూ 7-8 గంటలు నిద్రపోతే గుండె ఆరోగ్యం మెరుగుపడుతుంది.
* చిక్కుళ్లు, బఠానీలు, చేపలు, బాదం, పిస్తా వంటి గింజపప్పులను ఆహారంలో భాగం చేసుకోవాలి.
* జంక్ ఫుడ్ ఎక్కువగా తినొద్దు. బరువు పెరగకుండా చూసుకోవాలి. దీంతో మధుమేహం ముప్పు పెరుగుతుంది.
* రోజూ తగినంత నీరు తాగండి. ఎందుకంటే ఒంట్లో నీటి శాతం తగ్గితే రక్తం చిక్కబడి గుండెజబ్బు ఉన్న వారికి అది మరింత హాని చేస్తుంది.