దువ్వూరు మండల కేంద్రము లోని దేవాన్ష్ ఫంక్షన్ హాల్ లో మంగళవారం ఉదయం 9. 30గం, మైదుకూరు శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామి రెడ్డి అధ్యక్షతన జగనన్న సచివాలయం గృహసారధుల మండల స్థాయి శిక్షణ సమావేశం నిర్వహించబడు తుందని దువ్వూరు మండల అధ్యక్షులు కానాల జయచంద్ర రెడ్డి సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. కావున దువ్వూరు మండల పరిధిలోని వైఎస్ఆర్సిపి నాయకులు, జడ్పిటిసి, సొసైటీ ప్రెసిడెంట్, ఎంపీటీసీలు, సర్పంచులు , నూతనంగా నియమించబడ్డ సచివాలయం కన్వీనర్లు, గృహ సారథులు, కార్యకర్తలు, వైఎస్ఆర్సీపీ అనుబంధ సంఘాల, నాయకులు హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు.