సిఐటియూ ఆధ్వర్యంలో అంగన్వాడి కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలంటూ జిల్లా కేంద్రమైన రాయచోటి లో కలెక్టరేట్ కార్యాలయం ఎదురుగా ధర్నా కార్యక్రమాన్ని సోమవారం నిర్వహించారు. సుప్రీం కోర్టు తీర్పు ఆధారంగా గ్రాట్యూటీ ఇస్తూ అంగన్వాడి కార్యకర్తలకు కనీస వేతనం 26 వేల రూపాయలు ప్రకటించాలి. ల్ జిల్లా అంగన్వాడీ కార్యదర్శి రాజేశ్వరి డిమాండ్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం కంటే వెయ్యి రూపాయలు అదనంగా ఇస్తానంటూ రాష్ట్ర ప్రభుత్వం మేనిఫెస్టో లో చెప్పిన విధంగా అమలు చేయాలని, రాష్ట్ర ప్రభుత్వం తీసుక వచ్చిన ఫేస్ యాప్ ను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు.