మద్యంపై అక్రమ ఆదాయాన్ని దండుకునేందుకే జగన్రెడ్డి ప్రభుత్వం లిక్కర్ షాపుల్లో డిజిటల్ చెల్లింపులకు అనుమతించడం లేదని టీడీపీ ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ ఆరోపించారు. ఈమేరకు ఆదివారం ఆయన ఓ ప్రకటన చేశారు. అధికారంలోకి వచ్చి నాలుగేళ్లు అవుతుంటే.. ఇప్పుడు కేవలం 11 షాపుల్లోనే డిజిటల్ పేమెంట్స్కు అనుమతివ్వడం ఏంటని ప్రశ్నించారు. ఇదేమైనా సంక్షేమ పథకమా? వినూత్న కార్యక్రమమా? పైలట్ ప్రాజెక్టా? అని ఎద్దేవా చేశారు.