రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షులు రాజ్యసభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, రాజ్యసభ సభ్యులు బీద మస్తాన్ రావు తదితరులు ఆత్మీయంగా భేటీ అయ్యారు. వైకా నెల్లూరు రూరల్ నియోజకవర్గ ఇన్చార్జిగా నియమించిన ఆదాల ప్రభాకర్ రెడ్డి స్వాగత ఏర్పాట్లకు సంబంధించి కార్యక్రమంలో సోమవారం వారు ఒకరికొకరు ఆప్యాయంగా పలకరించుకున్నారు. వైసీపీ బలోపేతానికి నేతలందరూ ఐక్యంగా పనిచేసేలా కార్యాచరణ రూపొందించారు.