టర్కీ, సిరియా దేశాలు వరుస భూప్రకంపనలతో అల్లాడిపోతున్నాయి. శక్తిమంతమైన భూకంపాలు వేల మంది ప్రాణాలు తీశాయి. భూకంప తీవ్రతకు అనేక భవనాలు పేకమేడల్లా కూలిపోయాయి. టర్కీలోని హతయ్ ప్రావిన్స్‌లో గల ఎయిర్‌పోర్టులో ఉన్న ఒకే ఒక్క రన్‌వే ప్రకంపనల ధాటికి తీవ్రంగా ధ్వంసమైంది. భారీగా పగుళ్లు ఏర్పడి రన్‌వే రెండుగా చీలిపోయిన దృశ్యాలు నెట్టింట వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఎయిర్‌పోర్టులో విమాన రాకపోకలను నిలిపివేశారు.