నెల్లూరు నగరంలోని రాయపాలెం కాలువ పూడిక పనులు త్వరితగతన చేయించి పైకప్పు వేయించాలని జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి కిషోర్ గునుకుల నెల్లూరు మున్సిపల్ కమిషనర్ హరిత కు వినతి పత్రం అందజేశారు.
నెల్లూరు సిటీ పదో డివిజన్ నందు రాయపేట కాలువ పూడిక తీసి దాదాపుగా నాలుగు సంవత్సరాలు అవుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని ఈ సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేసారు.