ఎల్ఐసి ని ప్రైవేటీకరణ చేయడానికి నిరసిస్తూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఆస్తుల పరిరక్షణ కమిటీ ఛైర్మన్, నెల్లూరు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు చేవూరు దేవకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని నిర్వహించారు. నెల్లూరు జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో స్థానిక కాంగ్రెస్ కార్యాలయం ఇందిరాభవన్ వద్ద నుండి భారీ బహిరంగ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ ప్రభుత్వ రంగ సంస్థలను నిర్వీర్యం చేసేందుకు ఒక పథకం ప్రకారం కుట్ర చేస్తున్నారన్నారు. కేవలం అదానీ, అంబాని లను మాత్రం ప్రోత్సహిస్తున్నారని విమర్శించారు.