దేశవ్యాప్తంగా రేషన్ డీలర్లు ఆందోళన బాట పట్టారు. కమిషన్ల ప్రాతిపదికన కాకుండా.. ఉద్యోగ భద్రత కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. మొత్తం 11 డిమాండ్లతో మూడు రోజుల పాటు ధర్నా చేయనున్నట్లు రేషన్ డీలర్స్ ఫెడరేషన్ తెలిపింది. ఫిబ్రవరి 7, 8, 9 తేదీల్లో ధర్నా చేస్తామని ఈ 3 రోజులు రేషన్ షాపులను తెరవమని రేషన్ డీలర్స్ ఫెడరేషన్ స్పష్టం చేసింది. దీంతో రేషన్ సరుకులు లభించే అవకాశం ఉండదు.