చనిపోయాడనుకుని ఖననం చేసిన వ్యక్తి లైవ్ వీడియోలో కనిపించాడు. మహారాష్ట్రలోని పాల్ఘర్కు చెందిన 60 ఏళ్ల రఫిక్ షేక్ 2 నెలల క్రితం కనిపించకుండా పోయాడు. ఆ సమయంలో ఓ హత్య ఘటనలో చనిపోయిన వ్యక్తిని పరిశీలించిన షేక్ భార్య తన భర్తేనని నిర్ధరించటంతో ఆయనకు ఖననం సైతం చేసేశారు. కొద్ది రోజుల తర్వాత షేక్ తన స్నేహితుడికి వీడియో కాల్ చేయటంతో అతను పోలీసులను ఆశ్రయించాడు. చనిపోయిన వ్యక్తి, షేక్ ఒకటి కాదని వారు నిర్ధారించుకున్నారు.