దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు అంతర్జాతీయ మార్కెట్ల మిశ్రమ సంకేతాల మధ్య మంగళవారం స్వల్ప లాభాలతో ప్రారంభమయ్యాయి. ఉదయం సెన్సెక్స్ 77 పాయింట్ల లాభంతో 60,584 వద్ద, నిఫ్టీ 27 పాయింట్ల లాభంతో 17,791 వద్ద కొనసాగుతోంది. డాలరుతో పోలిస్తే రూపాయి మారకం విలువ 82.71 వద్ద ప్రారంభమైంది. టాటా స్టీల్, ITC, HUL,సన్‌ఫార్మా, టైటన్, టాటా మోటార్స్, విప్రో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి.