నిమ్మకాయలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీరం రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడుతుంది. బరువు తగ్గాలని ప్రయత్నించే వారు నిమ్మరసం ఎక్కువగా తీసుకుంటారు. అయితే నిమ్మరసం చేసేటప్పుడు రసంతో పాటు నిమ్మ చెక్కలను కూడా అందులోనే వేసి కాసేపు ఉంచడం వల్ల మంచి ఫ్లేవర్, రుచితో పాటు పోషకాలు కూడా ఎక్కువగా అందుతాయి.