కావలసిన పదార్థాలు:
చపాతీలు: నాలుగు, పల్లీలు: రెండు టీ స్పూన్లు, నూనె: రెండు టేబుల్ స్పూన్లు, కరివేపాకు: రెండు రెమ్మలు, గుడ్లు: రెండు, ఉల్లిపాయ: ఒకటి, పచ్చిమిర్చి: నాలుగు, ఉప్పు: తగినంత, మిరియాల పొడి: పావు టీ స్పూన్, కొత్తిమీర: కొద్దిగా
తయారీ విధానం:
ముందుగా చపాతీలను చిన్నచిన్న ముక్కలుగా చేసి, పక్కన పెట్టుకోవాలి. పాన్‌లోని నూనె వేడయ్యాక తరిగిన ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి వేయించాలి. ఉల్లిపాయ ముక్కలు కాస్త వేగిన తర్వాత పల్లీలు, ఉప్పు, మిరియాల పొడి వేసి మరికాసేపు వేగిన తర్వాత.. గుడ్లు కూడా వేసి వేయించాలి. అన్నీ బాగా వేగాక ముక్కలు చేసి పెట్టుకున్న చపాతీ వేసి, ఐదు నిమిషాలపాటు వేయిస్తే వేడివేడి రోటీ ఉప్మా సిద్ధం.