ఉరవకొండ, వజ్రకరూరు మండల పరిధిలోని పందికుంట గ్రామంలో ఈరోజు(మంగళవారం) ఉదయం 9.30 గంటలకు నియోజకవర్గ ఇంచార్జ్, మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఆధ్వర్యంలో 'గడప గడపకూ మన ప్రభుత్వం' కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వైస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో తెలిపింది. కావున ఈ కార్యక్రమానికి వజ్రకరూరు మండల ప్రజాప్రతినిధులు, అధికారులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు తప్పక హాజరుకావాలని ఆ ప్రకటనలో పార్టీ కోరింది.