దేశంలోని ప్రతి డ్రైవర్ తెలుసుకోవలసిన అత్యంత సాధారణ ట్రాఫిక్ నియమాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం.
1. మద్యం సేవించి డ్రైవ్ చేయవద్దు
మద్యం తాగి రోడ్డు ప్రమాదాల కారణంగా రోజుకు 19 మంది భారతీయులు మరణిస్తున్నారని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ప్రస్తుత చట్టం ప్రకారం డ్రైవింగ్ కోసం అనుమతించదగిన బ్లడ్ ఆల్కహాల్ పరిమితి 0.03% వరకు ఉంటుంది. ఇది 100 ml రక్తానికి 30 mg ఆల్కహాల్‌కు సమానం.
ఒక వ్యక్తి ఈ BAC పరీక్షలో ఉత్తీర్ణత సాధించడంలో విఫలమైతే అతను/ఆమెకు చివరి బ్లడ్ ఆల్కహాల్ పరిమితి ఆధారంగా రూ.2000 నుంచి రూ.10000 మధ్య జరిమానా విధించవచ్చు. అంతేకాకుండా అటువంటి వ్యక్తులకు 7 నెలల నుండి నాలుగు సంవత్సరాల మధ్య జైలు శిక్ష కూడా విధించబడుతుంది.
2. ఎల్లప్పుడూ చెల్లుబాటు అయ్యే కారు బీమా పాలసీని కలిగి ఉండాలి.
మోటారు వాహనాల చట్టం 1988 ప్రకారం భారతదేశంలోని అన్ని మోటారు వాహనాలు అన్ని సమయాల్లో చెల్లుబాటు అయ్యే థర్డ్-పార్టీ బీమా కవరేజీని కలిగి ఉండాలి. మీరు జాగ్రత్తగా లేకుంటే బీమా పాలసీ తప్పిపోయినట్లయితే, అటువంటి రక్షణ ప్రణాళిక లేకుండా వాహనం నడిపినందుకు మీకు జరిమానా విధించబడవచ్చు. ట్రాఫిక్ అధికారులు మొదటిసారిగా ఈ తరహా తప్పు చేస్తే రూ.2000 జరిమానా విధిస్తారు. అయితే పునరావృతం చేసే నేరాలకు రూ.4000 వరకు జరిమానా విధించవచ్చు.
3. కారు నడుపుతున్నప్పుడు మీ సీట్‌బెల్ట్ ధరించండి.
మీరు డ్రైవింగ్ చేయడం కొత్త అయితే మీ వాహనంలోకి ప్రవేశించిన తర్వాత మీరు చేసే మొదటి పనిగా సీట్ బెల్ట్ ను సురక్షితంగా ఉంచుకోవడం అలవాటు చేసుకోండి. ఇలా చేయడం వల్ల ట్రాఫిక్ ఉల్లంఘనలను నివారించడమే కాకుండా ప్రమాదాలు జరిగినప్పుడు మీ ప్రాణాలను కూడా కాపాడుకోవచ్చు. మీరు మీ నడుము మరియు ఛాతీ చుట్టూ ఈ సీట్ బెల్ట్ లేకుండా డ్రైవింగ్ చేస్తూ పట్టుబడితే ట్రాఫిక్ పోలీసులు అక్కడికక్కడే ఈ ఉల్లంఘనకు మీకు రూ.1000 వరకు జరిమానా విధించవచ్చు.
4. హెల్మెట్ లేకుండా ద్విచక్ర వాహనం నడపకూడదు.
ద్విచక్ర వాహనం నడుపుతున్నప్పుడు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలి. ఇక్కడ గమనించవలసిన ఒక విషయం ఏమిటంటే డ్రైవర్ మాత్రమే కాకుండా ద్విచక్ర వాహనంపై వెళ్లే వారందరూ తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని చట్టం చెబుతోంది. ఈ నిబంధనను పాటించనందుకు రూ.1000 వరకు జరిమానా విధించొచ్చు. మీ లైసెన్స్‌ను 3 నెలల వరకు సస్పెండ్ చేసే ఛాన్స్ కూడా ఉంది.
5. డ్రైవింగ్ చేసేటప్పుడు మొబైల్ ఫోన్ ఉపయోగించకూడదు.
అక్టోబర్ 1, 2020 నుండి అమల్లోకి వచ్చిన కొత్త మోటార్ వెహికల్ నిబంధనల ప్రకారం డ్రైవర్లు తమ ఫోన్‌లను నావిగేషనల్ టూల్‌గా మాత్రమే ఉపయోగించగలరు. డ్రైవింగ్ చేస్తున్నప్పుడు మీరు ఫోన్‌ను మరేదేనికైనా ఉపయోగించినట్లయితే రూ.5000 వరకు జరిమానా చెల్లించాల్సి వస్తుంది. ఏడాది జైలు శిక్ష కూడా పడే అవకాశం ఉంది.
6. ఓవర్ స్పీడ్
డ్రైవర్లు రోడ్లపై సిఫార్సు చేసిన వేగ మార్గదర్శకాలను ఎన్నడూ మించకూడదు, అలా చేయడం వల్ల ట్రాఫిక్ పోలీసుల ఆగ్రహానికి గురవుతారు. ఒక నివేదిక ప్రకారం 2018లో 66% ప్రమాదాలు భారతీయ రహదారులపై అతివేగంగా నడపడం వల్లనే సంభవించాయి. మీ వాహనం పరిమాణాన్ని బట్టి అతివేగానికి విధించే జరిమానా మారుతూ ఉంటుంది. సాధారణంగా రూ.1000 నుంచి రూ.2000 మధ్య ఉంటుంది.
7. రెడ్ లైట్ జంపింగ్
మీరు డ్రైవింగ్ చేస్తున్నప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ లకు కట్టుబడి ఉండేలా చూసుకోండి. లేదంటే మీరు రూ.5000 వరకు జరిమానా, ఒక సంవత్సరం జైలు శిక్షను అనుభవించాల్సి వస్తుంది. ‘బెటర్ లేట్ దేన్ నెవర్’ అనే పాత సామెతను గుర్తుంచుకోండి.