సిట్రస్ జాతికి చెందిన కిన్నో పండ్లుకు మార్కెట్ లో మంచి డిమాండ్ ఉంది. కాబట్టి వీటిని సాగు చేసిన రైతులకు అధిక లాభాలు వచ్చే అవకాశం ఉంది. ఒక ఎకరంలో సుమారు 214 కిన్నో చెట్లు నాటవచ్చు. ఒక చెట్టు నుంచి సుమారు 80-150 కిలోల కిన్నో పండ్లు వస్తాయి. నాణ్యత బట్టి రేటు ఉంటుంది. బహిరంగ మార్కెట్లో కిలో కిన్నో పండ్ల ధర రూ.100 వరకు ఉంటుంది. పెద్ద మొత్తంలో వీటిని సాగు చేస్తే.. అధిక లాభాలు వస్తాయి.