సంత కొత్తవలస గ్రామంలో అగ్నిప్రమాదంలో కాలి బూడిదైనా రెండు పూరీల్లు బాధిత కుటుంబాలను రాష్ట్ర యువజన విభాగ ప్రధాన కార్యదర్శి తమ్మినేని చిరంజీవినాగ్ పరామర్శించారు. ఆముదాలవలస మండలం లోని కే మునగవలస పంచాయతీ పరిధిలోని సంత కొత్తవలస గ్రామంలో సోమవారం జరిగిన అగ్ని ప్రమాదంలో రెండు పురిల్లు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన బూరవెల్లి అప్పలనాయుడు మరియు బూరవెల్లి అసిరయ్య కు చెందిన ఇల్లు సర్క్ సర్క్యూట్ వల్ల దగ్ధమయ్యాయి. విషయం తెలుసుకున్న యువ నాయకులు చిరంజీవి నాగ్ ఆ కుటుంబాలను మంగళవారం పరామర్శించారు. కష్టపడి సంపాదించుకున్న నగదు బట్టలు వస్తువులు కాలిపోయాయని బాధితులు చిరంజీవి నాగ్ ముందు రోదించారు. బాధిత కుటుంబాలకి 20 వేల రూపాయలు సాయాన్ని చిరంజీవి నాగ్ అందించారు. ప్రభుత్వం నుండి అందవలసిన సాయాన్ని అధికారులతో మాట్లాడి అందించే విధంగా చర్యలు తీసుకుంటామని చిరంజీవి నాగ్ తెలియజేశారు. ఈ కార్యక్రమం లో స్థానిక నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.