జిల్లాలో పశుగ్రాసం కొరతతో మూగజీవాలు బక్క చిక్కిపోతున్నాయి. ట్రాక్టర్ వరిగడ్డి సుమారు పదివేల రూపాయల పైనే పలుకుతుండడంతో పశుపోషణ భారంగా మారిందని పారి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అయితే రైతు భరోసా కేంద్రాల ద్వారా రాయితీపై అందిస్తూ ఉన్న గడ్డి విత్తనాలను వినియోగించుకోవాలని అధికారులు చెబుతున్నారు. రాయితీపై సమీకృత దాణా సరఫరా చేస్తున్నామన్నారు. పశుగ్రాసం కొరత లేకుండా తగు చర్యలు తీసుకోనుట్లు తెలిపారు.