రాష్ట్రంలో ప్రతీ ఇంటికి ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రతి ఇంటి ఇంటికి వాలంటీర్ల ద్వారా అందుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే శంబంగి వెంకట చిన అప్పలనాయుడు అన్నారు. మంగళవారం పురపాలక సంఘం 03వ సచివాలయ పరిధిలో గల 06వ వార్డులో రెండవ రోజు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని ఆయన నిర్వహించారు. అనంతరం ప్రతీ ఇంటిఇంటికి వెళ్లి ప్రజలను ఆప్యాయంగా పలకరిస్తూ ప్రభుత్వ పథకాలు అమలు తీరును అరా తీశారు.
ప్రతీ గడపలో సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ పథకాలు అమలు పట్ల ప్రజలు సంతృప్తి వ్యక్తం చేశారు. తమకు ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలు వాలంటీర్లు ద్వారా సక్రమంగా అందుతున్నాయని లబ్ధిదారులు చెప్పడంతో ఎమ్మెల్యే హర్షం వ్యక్తం చేశారు. వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన ప్రభుత్వ సేవలు అందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో భాగంగా తమ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే సోదరులు శంబంగి వేణుగోపాలనాయుడు, మున్సిపల్ చైర్మన్ సావు వెంకట మురళీకృష్ణారావు, వైస్ ఛైర్మన్ గోళగాన రమాదేవి, బుడా ప్రతినిది ఇంటి గోపాలరావు, అగ్రికల్చర్ మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తెంటు పార్వతి, పట్టణ జెసీఎస్ కన్వీనర్ రేజేటి ఈశ్వరావు, వార్డు ఇంచార్జ్ శంకా గౌరిపతి, మున్సిపల్ వార్డు కౌన్సిలర్లు, ప్రజా ప్రతినిధులు మున్సిపల్ కోఆప్షన్ సభ్యులు, సచివాలయ కన్వీనర్లు, పట్టణ వైసీపీ నాయకులు ప్రభుత్వ అధికారులు, సచివాలయసిబ్బంది వాలంటీర్లు తదితరులు పాల్గొన్నారు.