ధాన్యం కొనుగోలు చేయాలంటూ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు ధాన్యం బస్తాలతో గంట్యాడ తాసిల్దార్ కార్యాలయం వద్ద బుధవారం నిరసన తెలియజేశారు. టిడిపి మండల పార్టీ అధ్యక్షుడు కొండపల్లి భాస్కర నాయుడు ఆధ్వర్యంలో కొటారబిల్లి జంక్షన్ వద్ద నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ జరిపారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ప్రభుత్వం ప్రతి గింజ కొనుగోలు చేయకపోతే ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. కొప్పుల వెలమ రాష్ట్ర కన్వీనర్ అల్లు విజయకుమార్, టిడిపి నాయకులు రండి చినరామునాయుడు పెద్దిరెడ్డి సతీష్, గాంధీ, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.