కుందుర్పి మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఈ నెల 11వ తేది శాంతిరామ్ కంటి ఆసుపత్రి వారి సహకారంతో ఛేంజ్ ఫర్ సొసైటీ టీం ఆధ్వర్యంలో కంటి చికిత్స, ఆపరేషన్లు, గుండె చికిత్సలు నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. పైసమస్యలతో బాధపడేవారు సద్వినియోగం చేసుకోవాలని ఛేంజ్ ఫర్ సొసైటీ టీం సభ్యులు కుందుర్పి భాస్కర్, సాగర్ వారి మిత్ర బృందం తెలిపారు. ఈ శిబిరంలో అర్హులైన వారిని నంద్యాల తీసుకొని వెళ్లి ఉచితంగా ఆపరేషన్లు చేసి పంపిస్థామని చెప్పారు. ఉచిత బస్సు సౌకర్యం కూడా కలదు అని అన్నారు. ఆపరేషన్ కొరకు హాజరయ్యే ప్రజలు ఆధార్ కార్డు, రేషన్ కార్డు, పాస్పోర్ట్ సైజ్ ఫోటో, ఆరోగ్య శ్రీ కార్డు, సెల్ ఫోన్ నెంబర్ తమ వెంట తీసుకుని రావాలని కోరారు. ఈ కార్యక్రమం గురించి ప్రతి ఒక్కరికి సమాచారం చేరవేయాలని సూచించారు. పై తెలిపిన సమస్యలతో ఇబ్బంది పడుతున్నా వారిని పెద్ద ఎత్తున తీసుకుని రావాలని వారు పిలుపునిచ్చారు. మరింత సమాచారం కోసం ఈ నెంబర్లను 09980269623, 6302800481.