అనంతపురం జిల్లా ఉరవకొండ మండలంలోని చిన్న మూస్టురు గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని బుధవారం నిర్వహించారు. ఉరవకొండ మాజీ ఎమ్మెల్యే వై. విశ్వేశ్వరరెడ్డి ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. ముందుగా వైస్సార్సీపీ నేతలు ఆయనకు ఘన స్వాగతం పలికారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఇంటింటికి వెళ్లి ప్రభుత్వం అందించిన పథకాలను ప్రజలకు వివరించారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందుతున్నాయా లేదా అని తెలుసుకోవడమే కాకుండా ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే ముఖ్యమంత్రి జగన్ కృషి చేస్తున్నారన్నారు. పలువురు కొన్ని సమస్యలను ఆయన దృష్టికి తీసుకువచ్చారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిష్కరించాలని విశ్వేశ్వరరెడ్డి ఆదేశించారు. ఆయన వెంట మండల వైస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు తదితరులు ఉన్నారు.