యూపీలో ప్రభుత్వ సొమ్ముతో ఐదుగురు మహిళలు తమ భర్తలను వదిలేసి ప్రియుళ్లతో పరారయ్యారు. పీఎం ఆవాస్ యోజన కింద భూమి ఉన్న పేదలకు ఇల్లు కట్టుకునేందుకు కేంద్రం రూ.3 లక్షలు ఇస్తోంది. మొదటి విడతలో రూ.50 వేలు పడగానే బారాబంకీ జిల్లాలో ఐదుగురు మహిళలు భర్తలను వదిలి ప్రియుళ్లతో జంప్ అయ్యారు. దీంతో షాకైన భర్తలు మిగతా సొమ్ము వారి ఖాతాల్లో వేయొద్దని అధికారులను వేడుకుంటున్నారు.