అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప కాగినెల్లి ఆదేశాల మేరకు ఏ. ఆర్ సిబ్బందికి స్థానిక పోలీసు పరేడ్ మైదానంలో బుధవారం మాబ్ ఆపరేషన్ పై ప్రాక్టీస్ చేయించారు. అలాగే శాంతిభద్రతలకు విఘాతం కలిగే సందర్భాలలో, ఆందోళనల సమయాలలో జన సమూహాన్ని ఎలా చెదరగొట్టాలి, ఎలా సద్దుమణచాలి, తదితర అంశాలపై తర్ఫీదునిచ్చారు. సమూహాలను చెదరగొట్టే క్రమంలో ఆందోళనకారులు లేదా పోలీసు సిబ్బంది గాయపడితే ఎలాంటి తక్షణ చర్యలు చేపట్టాలో రీహార్సల్ చేయించారు.