బుధవారం ఉరవకొండ పట్టణంలోని మార్కెట్ యార్డ్ వద్ద రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. జిల్లాలో రైతులు అధికంగా పప్పుసేనగ పంటను లక్షల ఎకరాల్లో సాగు చేశారు. మీరు పెట్టిన పంటను ప్రభుత్వమే కొనుగోలు కేంద్రాల ద్వార కొంటామని, మద్దతు ధర కల్పిస్తామని గతంలో హామీ ఇచ్చారు. ఇప్పటికి అరకొరగా కొనుగోలు చేసి చేతులు దులుపుకుంటున్నారని. ఈ సంవత్సరం పండిన పంట దాదాపుగా 25రోజుల నుండి కళ్ళతోనే ఉండిపోయింది. కానీ ప్రభుత్వ అధికారులు మాత్రం ఇంకా పంట పండలేదనే ధోరణిలోనే ఉన్నారు. ఇప్పటికైనా మొద్దు నిద్ర వీడి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తున్నాము. రైతులు పండించిన పంట ప్రస్తుతం మార్కెట్లో రూ. 4400 నుండి రూ. 4600 మాత్రమే ఉన్నది. ప్రభుత్వం మాత్రం రైతులకు మేము సబ్సిడీతో ఇత్తనం ఇస్తున్నాం అని చెప్పి రూ. 6600తో కొనుగోలు చేసి రౌతులకు రూ. 5100 ఇచ్చి మిమేదో రైతులను ఉద్ధరించినట్లు గొప్పలు చొప్పుకుంటున్నారు. గత ఐదు సంవత్సరాల నుండి ఎక్కడ ఉన్నా ధర అక్కడే ఉంది. ఇప్పటికైనా ప్రభుత్వం కళ్ళు తెరచి రూ. 6500తో ప్రభుత్వమే కొనుగోలు చేయాలని ఆంద్రప్రదేశ్ రైతు సంఘం గా డిమాండ్ చేస్తున్నాం. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి ఎన్. మధుసూదన్, నాయకులు మురళి, వీరంజినేయులు, సిద్ధప్ప, రైతులు పాల్గొన్నారు.