రాజకీయ నాయకులు, అధికారులు, నీటిని అమ్ముకుంటున్నారని రాయలసీమ స్టీరింగ్ కమిటీ కన్వీనర్ ఉద్యమ నేత బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి సంచల వ్యాఖ్యలు చేశారు. గురువారం కర్నూల్ లో ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. రాయలసీమ రైతులకి సాగునీటి కేటాయింపులో మోసం జరుగుతుందన్నారు. కర్ణాటకలో అప్పర్ భద్ర ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ ఈనెల 26న ఆదోనిలో ప్రజా ప్రదర్శన నిర్వహిస్తున్నామని సీమవాసులు అందరూ కలిసి భారీగా తరలిరావాలని పిలుపునిచ్చారు.