జాతీయ విద్యా విధానం భారతదేశం యొక్క స్టార్టప్ పర్యావరణ వ్యవస్థను ప్రోత్సహిస్తుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. జాతీయ విద్యా విధానం(NEP)-2020 గురించి ఆయన మాట్లాడుతూ విద్యార్థులు, యువతకు కొత్త కెరీర్, వ్యవస్థాపక అవకాశాలు వచ్చేలా చేస్తుందని అన్నారు. 2014 నుండి 2022 వరకు 8 ఏళ్లలో భారత్ లో స్టార్టప్‌ల సంఖ్య సుమారు 300-400 నుండి దాదాపు 90,000 కు పెరిగిందని చెప్పారు. సిలబస్‌ను తిరిగి పరిశీలించడం, చక్కటి ట్యూనింగ్ చేయడం ద్వారా పాఠశాలలు పరివర్తనకు మాధ్యమంగా మారగలవని సింగ్ అన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa