అనంతపురం జిల్లా ఉరవకొండ ఎస్బిఐ బ్యాంకు వద్ద సిపిఐ నాయకులు ధర్నా నిర్వహించారు. బిజెపి నరేంద్ర మోడీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రజా వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకిస్తూ, ప్రజా ధనాన్ని కొల్లగొడుతున్న ఆదానీ ఆస్తులను జఫ్తు చేయాలని సిపిఐ నాయకులు నిరసన చేపట్టారు. సిపిఐ నాయకులు మాట్లాడుతూ ప్రజాధనాన్ని కొల్లగొడుతున్న ఆదానీ ఆస్తులను ప్రభుత్వం జఫ్తు చేసుకోవాలని డిమాండ్ చేశారు. ఎల్ఐసీ మరియు ఎస్బిఐ డబ్బులను షేర్ మార్కెట్లు లో అప్పనంగా తగిలేసిన ఆదానీ పై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని పేర్కొన్నారు. తక్షణం ప్రజాధనాన్ని రికవరీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ నాయకులు మల్లికార్జున, మనోహర్, మల్లేష్, సుల్తాన్, రమేష్, మల్లికార్జున నాయకులు తదితరులు పాల్గొన్నారు.