రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయం లో శ్రీశ్రీ కామాక్షి సమేత తృతేశ్వర స్వామి దేవస్థానము హత్యరాల మహాశివరాత్రి కళ్యాణోత్సవము బ్రహ్మరథోత్సవము పోస్టల్ ను శుక్రవారం విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా రాజంపేట శాసనసభ్యులు మేడా వెంకట మల్లికార్జున్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో హత్యరాల దేవాలయం చైర్మన్ వెంకట సుబ్బారెడ్డి , మందరం వేణుగోపాల్ రెడ్డి , మందరం గంగిరెడ్డి పాలగిరి మల్లికార్జున్ రెడ్డి , సర్పంచ్ శేఖర్ రెడ్డి , ఒంటిమిట్ట సచివాలయం కన్వీనర్ ఇంచార్జ్ రఘురాం రెడ్డి తదితరులు పాల్గొన్నారు.